Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హర్యానాలో వినేశ్ ఫొగాట్‌పై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరంటే?

Capt Bairagi against Vinesh Phogat
Advertisement
  • జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వినేశ్ ఫొగాట్ పోటీ
  • కెప్టెన్ యోగేశ్ బైరాగిని ఖరారు చేసిన బీజేపీ 
  • జేజేపీ నుంచి బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్జీత్ దాండా
Advertisement
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం బరిలో బీజేపీ నుంచి కెప్టెన్ యోగేశ్ బైరాగిని అధిష్ఠానం ఖరారు చేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీ చేస్తున్నారు. జేజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్జీత్ దాండా తిరిగి బరిలో నిలిచారు. 

బీజేపీ అభ్యర్థి యోగేశ్ బైరాగి బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, హర్యానా స్పోర్ట్స్ సెల్ కో-కన్వీనర్‌గా ఉన్నారు.

అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 21 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇద్దరు ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించింది. 90 నియోజకవర్గాలకు గాను రెండు జాబితాలతో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అంతకుముందే, 67 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది.
Advertisement
Advertisement
Vinesh Phogat
BJP
Congress

More Telugu News